కల్తీ కల్లు ఘటనపై మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ (VIDEO)

HYDలో జరిగిన కల్తీ కల్లు ఘటనపై మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలైంది. కల్తీ కల్లు మృతుల బంధువుల తరఫున రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో హైకోర్టు న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం అందించాలని కోరారు. తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్