తెలంగాణ హైకోర్టు హిల్ట్ పాలసీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పాలసీపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, పర్యావరణవేత్త పురుశోత్తం దాఖలు చేసిన పిల్ పై విచారణ జరిపిన న్యాయస్థానం, 9,292 ఎకరాల భూకేటాయింపు నిబంధనలకు విరుద్ధమని, దీనిపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని, రికార్డులు సీజ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని కోరిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది.