యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎప్పటినుంచంటే?

ఈపీఎఫ్ఓ (EPFO) ఖాతాదారులకు శుభవార్త. యూపీఐ, ఏటీఎంల ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని త్వరలోనే ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిస్టమ్ అప్‌గ్రేడేషన్ పనుల వల్ల జాప్యం జరిగినప్పటికీ, ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ కొత్త సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ప్రత్యేక యాప్ ద్వారా పీఎఫ్ నిధుల్లో గరిష్టంగా 75% వరకు యూపీఐ విధానంలో విత్ డ్రా చేసుకోవచ్చు, అయితే ఖాతాలో 25% బ్యాలెన్స్ ఉంచడం తప్పనిసరి. ప్రస్తుతం క్లెయిమ్ డబ్బులు జమ కావడానికి 3 రోజులు పడుతుండగా, యూపీఐ ఫీచర్‌తో కేవలం కొన్ని గంటల్లోనే నిధులు జమవుతాయి.

సంబంధిత పోస్ట్

✕
✕