ఈ నెంబర్ ఉంటేనే అకౌంట్లలోకి PM కిసాన్, అన్నదాత సుఖీభవ డబ్బులు

రైతులకు డిజిటల్ గుర్తింపుగా 11 అంకెల ఫార్మర్‌ ఐడీను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి. రైతుల భూమి, ఆధార్‌, మొబైల్‌ వివరాలను ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ-పంట నమోదు, పంట నష్టం పరిహారం, బీమా, రుణాలు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు వంటి ప్రయోజనాలకు ఈ ఐడీ కీలకం కానుంది. అలాగే పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ఆర్థిక సాయం పొందడంలోనూ ఉపయోగపడనుంది. రైతులు సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕