బిహార్ ఎన్నికల తర్వాతే ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు!

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత డబ్బుల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 6న మొదటి దశ పోలింగ్ జరగ్గా.. 11న రెండవ దశ పోలింగ్, 14న ఫలితాలు రానున్నాయి. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాతే 21వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెబుతున్నారు. కాగా కేంద్రప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత పోస్ట్