ఎన్‌జీటీ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీలో ఎన్‌జీటీ సదస్సులో ప్రధాని మోదీ 'ఎన్‌జీటీ మొబైల్ యాప్'ను ప్రారంభించారు. పారిస్ ఒప్పందం లక్ష్యాలను గడువు కంటే ముందే పూర్తి చేసిన ఏకైక జీ20 దేశం భారత్‌యేనని, స్వచ్ఛ ఇంధన రంగాల్లో దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. గత 12 ఏళ్లలో సౌర విద్యుత్ సామర్థ్యం 2 గిగావాట్ల నుంచి 160 గిగావాట్లకు పెరిగిందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి కర్బన ఉద్గారాలు భారత్ కంటే 6 రెట్లు ఎక్కువని చెబుతూ.. మిషన్ లైఫ్, అంతర్జాతీయ సౌర కూటమి ద్వారా వాతావరణ సవాళ్లకు భారత్ ఆచరణాత్మక పరిష్కారాలు చూపుతోందన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕