చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారుల ఆర్థిక సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి స్వనిధి (పీఎం స్వనిధి) పథకం విజయవంతంగా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2020 జూన్ 1న ప్రారంభమైన ఈ పథకం ద్వారా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని 2030 వరకు పొడిగించి, రుణ పరిమితిని రూ.80 వేల నుంచి రూ.90 వేలకు పెంచింది. తాకట్టు లేకుండా రుణం, మూడు విడతలుగా పంపిణీ, ఆధార్ కార్డుతో సులభంగా రుణం పొందడం దీని ప్రత్యేకతలు.