వింబుల్డన్ 2025 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ అద్భుత ప్రదర్శనతో టైటిల్ కైవసం చేసుకుంది. అమెరికన్ ప్లేయర్ అనిసిమోవాను 6-0, 6-0 తేడాతో చిత్తుచేసింది. గ్రాస్ కోర్ట్‌పై తొలిసారి వింబుల్డన్ గెలిచిన స్వియాటెక్‌కు ఇది ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్. మ్యాచ్‌లో స్వియాటెక్ దూకుడు, అనిసిమోవా సర్వీస్ లోపాలు ప్రధానంగా నిలిచాయి. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా ఆధిపత్యం చాటింది.