విదేశీయులకు ఇళ్లు అద్దెకిచ్చే యజమానులకు పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్‌లో విదేశీయులకు ఇళ్లు, హాస్టళ్లు, హోటళ్లు అద్దెకు ఇచ్చే యజమానులు వారి వీసా, పాస్‌పోర్ట్ వివరాలను తప్పనిసరిగా సరిచూసుకోవాలని పోలీసులు హెచ్చరించారు. నకిలీ పత్రాలు లేదా గడువు ముగిసిన వీసాలతో ఉంటున్న వారి వివరాలను వెంటనే పోలీసులకు తెలపాలని, లేనిపక్షంలో యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆగస్టు 31 నుంచి చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా ఉంటున్న 49 మంది విదేశీయులను గుర్తించి హోల్డింగ్ సెంటర్లకు తరలించారు. వీరిలో కొందరు డ్రగ్స్, గంజాయి, నకిలీ నోట్లు, మోసాలు, వ్యభిచారం వంటి నేరాల్లో చిక్కుకున్నట్లు తెలిపారు

సంబంధిత పోస్ట్

✕
✕