36.10 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు: రాష్ట్రంలో 22,979 బూత్‌లు సిద్ధం

TG: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి పల్స్‌ పోలియో కార్యక్రమం ప్రారంభం కానుంది. 0–5 ఏళ్లలోపు 36.10 లక్షల మంది చిన్నారులకు రెండు చుక్కల బైవేలెంట్‌ ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఆదివారం బూత్‌లలో, జూన్‌ 29–30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన పిల్లలకు టీకా అందిస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజి­గిరి, సంగారెడ్డి జిల్లాల్లో జూలై 1న కూడా కా­ర్య­క్రమం కొనసాగుతుంది. ఇందుకోసం రాష్ట్రంలో 22,979 పోలియో బూత్‌లు, 903 మొబైల్‌ బృందాలు, 104 ట్రాన్సిట్‌ పాయింట్లను ఏర్పా­టుచేశారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్