బైక్‌లో పొరపాటున డీజిల్ పోస్తే ఇలా చేయండి!

బైక్‌లలో పొరపాటున డీజిల్ పోయడం వల్ల ఇంజిన్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్రోల్ తేలికగా ఆవిరై, స్పార్క్ ప్లగ్‌తో సులభంగా మండుతుంది. డీజిల్ సాంద్రత ఎక్కువ, మండటానికి అధిక వేడి, పీడనం అవసరం. పెట్రోల్ ఇంజిన్ డీజిల్‌ను మండించలేదు, దీంతో బైక్ స్టార్ట్ అవ్వదు. ఒకవేళ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తే, ఇంజిన్ ఆగిపోయి, సైలెన్సర్ నుండి నల్లటి పొగ వస్తుంది. స్పార్క్ ప్లగ్ దెబ్బతింటుంది. పొరపాటును గ్రహిస్తే, బైక్ కీ ఆన్ చేయకూడదు. ట్యాంక్‌లోని డీజిల్‌ను తీసివేసి, శుభ్రం చేసి, పెట్రోల్ నింపాలి. మధ్యలో ఆగిపోతే, మెకానిక్‌ను సంప్రదించి, ఫ్యూయల్ ట్యాంక్, ఇంజెక్టర్, స్పార్క్ ప్లగ్‌లను శుభ్రం చేయించాలి.

సంబంధిత పోస్ట్