TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో రూ.900 కోట్లు చెల్లించాలంటూ ప్రైవేటు కాలేజీలు విధించిన డెడ్‌లైన్ శనివారంతో ముగిసింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో నవంబర్ 3 నుంచి నిరవధిక బంద్‌కు కాలేజీలు సిద్ధమవుతున్నాయి. దసరాకు రూ.1200 కోట్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన రూ.900 కోట్లపై ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో మిగతా బకాయిలు విడుదల చేయాలని ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.