యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో లండన్లోని హీత్రూ, స్టాన్స్టెడ్ విమానాశ్రయాలతో పాటు మాంచెస్టర్, బర్మింగ్హామ్ తదితర నగరాల్లోని విమానాశ్రయాలపై ప్రభావం పడింది. ఈ సమస్య కారణంగా ఇప్పటివరకు దాదాపు 300 విమానాలు రద్దయినట్లు సమాచారం. సమస్యను పరిష్కరించేందుకు ఇంజినీర్లు ప్రయత్నిస్తున్నారని, సేవల పునరుద్ధరణకు కొంత సమయం పడుతుందని ‘నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్’ తెలిపింది.