జూనియర్ లెక్చరర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 81 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపల్స్‌గా ప్రమోషన్లు ఇస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో సోమవారం వీరికి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. సీనియారిటీ ఆధారంగా ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. దాంట్లో ఎవరైనా సుముఖత చూపకపోయినా, అందుబాటులో లేకపోయినా సీనియారిటీ ప్రకారం తర్వాత లెక్చకర్‌కు అవకాశం కల్పించనున్నారు.