'పుష్ప-2' తొక్కిసలాట ఘటన మరో మలుపు తిరిగింది. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ లైసెన్స్‌పై చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. హీరో అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో థియేటర్ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదని నోటీసులు ఇచ్చారు. లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, ఒకవేళ ఇవ్వకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.