QR కోడ్ ఉంటేనే సెక్రటేరియట్లోకి ఎంట్రీ!

TG: రాష్ట్ర సచివాలయంలో భద్రతను కట్టుదిట్టం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సాధారణ సందర్శకులు సచివాలయంలోకి ప్రవేశించాలంటే తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ కలిగి ఉండాలి. అధికారులు లేదా మంత్రుల పేషీలు అనుమతి ఇవ్వగానే, సందర్శకుల మొబైల్ ఫోన్‌కు క్యూఆర్ కోడ్ సందేశం వస్తుంది. గేటు వద్ద భద్రతా సిబ్బంది ఈ కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాతే లోపలికి అనుమతి లభిస్తుంది. సందర్శకులు గరిష్టంగా ఒక గంట మాత్రమే లోపల ఉండగలరు, సమయం దాటితే భద్రతా సిబ్బందికి అలర్ట్ వెళ్తుంది. దీనివల్ల అనవసరపు రద్దీ తగ్గి, పారదర్శకత, కట్టుదిట్టమైన భద్రత సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్