రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టులో ఊరట

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. 2025 జనవరి 15న జరిగిన ఏఐసీసీ మీటింగ్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సిమ్రాన్ గుప్తా అనే మహిళ రాహుల్ వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, రాహుల్ వ్యాఖ్యలు, పిటిషనర్ వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్, కింది కోర్టు ఆదేశాలను పక్కనబెట్టాల్సిన అవసరం లేదని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. జస్టిస్ విక్రమ్ డి చౌహాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్