భారతదేశంలో అత్యధిక పెట్రోలియం ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా రాజస్థాన్ రికార్డు సృష్టించింది. మహారాష్ట్రను వెనక్కి నెట్టి, దేశీయ ముడి చమురు ఉత్పత్తిలో 20 నుంచి 25 శాతం వాటాను ఈ రాష్ట్రం అందిస్తోంది. బార్మర్-సాంచోర్ బేసిన్‌లోని మంగళ, భాగ్యం, ఐశ్వర్య వంటి చమురు క్షేత్రాల నుంచి చమురును వెలికితీస్తున్నారు. గుజరాత్‌లోని రిఫైనరీలకు చేరవేసేందుకు 700 కిలోమీటర్ల వేడి పైప్‌లైన్ ఉపయోగిస్తున్నారు.