రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించిన తొలి ఘూమర్ ఫెస్టివల్‌లో 6100 మందికి పైగా మహిళలు పాల్గొని, సంప్రదాయ ఘూమర్ నృత్యంతో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. జైపూర్ సెంట్రల్ పార్క్‌లో జరిగిన ఈ వేడుకలో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్య ప్రదర్శన చేశారు. ఉప ముఖ్యమంత్రి దియా కుమారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, మహిళల విజయాన్ని కొనియాడారు.