తెలంగాణలో ఎక్కడా ఇంధన కొరత లేదని, వదంతులను నమ్మవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. పలు చోట్ల ఇంధన కొరత కారణంగా పెట్రోల్ బంకులు మూతబడుతున్నాయనే వార్తలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో కావాల్సిన ఇంధన నిల్వలు ఉన్నాయని, అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ కొరత సృష్టించడం, ఇంధనాన్ని నిల్వ చేయడం నేరమని హెచ్చరించారు.