హిమాయత్ సాగర్ డ్యామ్‌ను పరిశీలించిన డిసిపి

వర్షాకాల ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా, సోమవారం రాజేంద్రనగర్ జోన్ డిసిపి ఎస్. శ్రీనివాస్ ఐపీఎస్ హిమాయత్ సాగర్ డ్యామ్, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. డ్యామ్ పూర్తిస్థాయిలో నిండితే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితులపై జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలు, ఓఆర్ఆర్ పరిసరాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రమాదకర ప్రాంతాల్లో బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని, వర్షాకాలం ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్