124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ హిందూ స్మశానవాటికలో సుమారు 50 లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న బర్నింగ్ ఫ్లాట్ ఫారం స్లాబ్ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. పనులను నాణ్యతతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని, టాయిలెట్ బ్లాక్, సిట్టింగ్ గ్యాలరీ, పూజగది, వాచ్‌మాన్ రూమ్ వంటి మౌలిక వసతులను కూడా త్వరగా పూర్తి చేసి స్మశానవాటికను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, ఆంజనేయ ప్రసాద్ గౌడ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.