శ్రీరామ్ నగర్ బీ బ్లాక్ కాలనీలో సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ పరిశీలించారు

శేరిలింగంపల్లి డివిజన్‌లోని శ్రీరామ్ నగర్ బీ బ్లాక్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శుక్రవారం కాలనీవాసులతో కలిసి పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తిచేయాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమయానికి అందుబాటులోకి తేవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, జగన్మోహన్ రెడ్డి, క్రాంతి కిరణ్, నాగరాజు, నర్సింగ్ రావు, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్