షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ ను పరిశీలించిన అదనపు కలెక్టర్

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డును అదనపు జిల్లా కలెక్టర్ చంద్రారెడ్డి పరిశీలించారు. తడిసిన ధాన్యం విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వ్యాపారులను ఆదేశించారు. డీఎం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మరియు జిల్లా పౌర సరఫరాల అధికారికి వారం రోజుల్లోగా ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారికి సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించేలా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్