ఊపిరాడని పరిస్థితి... లింగారెడ్డిగూడ ప్రజల ఆవేదన

షాద్‌నగర్ నియోజకవర్గం లింగారెడ్డిగూడ గ్రామంలో డ్రైనేజీ సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గ్రామ శివారులో హైవే రోడ్డు పక్కనే ఉన్న మదర్సా, మస్జిద్ సమీపంలో షాద్‌నగర్ వైపు నుంచి వస్తున్న అండర్ డ్రైనేజీ మురికి కాలువ దుర్వాసన వెదజల్లుతోంది. ప్రతిరోజూ ఈ మార్గంలో వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసిన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. డ్రైనేజీ నీరు ఏరులై పారుతూ రోడ్డుపైకి చేరడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్