రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్. అజయ్ కుమార్ సోమవారం తనిఖీ చేశారు. రోగుల వార్డులలో వైద్యం ఎలా అందుతుందో అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి వార్డులతో పాటు పోస్టుమార్టం గదిని కూడా పరిశీలించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు.