సిద్దాపూర్ జోలికొస్తే సమరం తప్పదు.. ఎమ్మార్పీఎస్

ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నరసింహ మాదిగ, కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో భారీ చెత్త డంప్ యార్డు నిర్మాణాన్ని తీవ్రంగా ఖండించారు. పారిశ్రామిక వాడ కావడంతో ఇప్పటికే తీవ్ర వాయు కాలుష్యం ఉన్న ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు నిర్మాణం చేపడితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, ఎక్కడినుండో చెత్తను సేకరించి తమ ప్రాంతంలో వేయడానికి చూస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్