రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో గత రెండు రోజులుగా తీవ్రమైన పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కొరత లేదని చెబుతున్నా, సామాన్యులు మాత్రం వాహనాలు నెట్టుకుంటూ, క్యాన్లలో పెట్రోల్ కోసం పరుగులు తీస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనితో చాలామంది తమ వాహనాలను ఇళ్లకే పరిమితం చేయాల్సి వస్తోంది.