షాద్‌నగర్ నియోజకవర్గంలోని గంగాపుత్ర సంఘంలో జరిగిన కీలక సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సామాజిక సేవలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ఎన్నికలు జరిగాయి. గంగనామోని సత్తయ్యను నూతన అధ్యక్షుడిగా, గంగనామోని వెంకటేష్‌ను ఉపాధ్యక్షుడిగా, గడ్డం కుమార్‌ను కార్యదర్శిగా ఎన్నుకున్నారు. గడ్డం నందు, గంగనామోని బాలరాజ్, కాడమోనీ సంతోష్, గంగనామోని నరసింలు, గంగనామోని గంగాధర్, కాడమోని గణేష్‌లను సభ్యులుగా ఎంపిక చేశారు.