బక్రీద్ పండుగ వేళ కట్టుదిట్టమైన ఏర్పాట్లు

బక్రీద్ పండుగ సందర్భంగా షాద్ నగర్ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాయికల్ వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు షాద్ నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. గోరక్షకులు చట్టాన్ని గౌరవించాలని, అక్రమ పశు రవాణా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్