ఆసుపత్రిలో ఒకేసారి 17 మంది నర్సులు ప్రెగ్నెంట్.. వరల్డ్ రికార్డ్

అమెరికాలోని ఓహియోలో ఉన్న మీయామి వ్యాలీ హాస్పిటల్‌లో ఒకేసారి 17 మంది నర్సులు గర్భవతులు కావడం ఒక అరుదైన సంఘటనగా నిలిచింది. వీరంతా 12 నుండి 35 వారాల గర్భంతో ఉన్నారు. ఈ అద్భుతమైన క్షణాన్ని గుర్తుంచుకోవడానికి వీరంతా కలిసి రీసెంట్‌గా ఒక గ్రూప్ ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి 2019లో ఇదే హాస్పిటల్‌లో 11 మంది నర్సులు ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యారట. ఇప్పుడు ఆ రికార్డును వీరు బ్రేక్ చేసారు.

సంబంధిత పోస్ట్