రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన ద్వైమాసిక సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ నిర్ణయం వల్ల హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్నవారికి EMIలలో పెద్దగా మార్పులు ఉండవు.