ఆర్‌బీఐ రెపో రేటు పెంపు.. పెరగనున్న ఈఎంఐల భారం!

అక్టోబర్ 5 నుండి 7 వరకు జరగనున్న RBI ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలో రెపో రేటు 0.25% పెరిగి 5.50 శాతానికి చేరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరల ఒత్తిడి కారణంగా ఫిబ్రవరి 2023 తర్వాత తొలిసారి వడ్డీ రేట్ల పెంపునకు అవకాశాలున్నాయి. ఈ పెంపుతో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, గృహ, వాహన రుణాలపై భారం పెరిగి, నెలవారీ ఈఎంఐలు ప్రియం కానున్నాయి. డిసెంబర్‌లో మరోసారి రేట్లు పెరిగే ఛాన్స్ కూడా ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕