తెలంగాణ ప్రభుత్వం 22A విషయంలో కీలక ప్రకటన చేసింది. GHMC, DTCP, HMDA అనుమతులు ఉంటే, 22A పరిధిలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల అనేక మంది భూ యజమానులకు ఊరట లభించనుంది. గతంలో 22A కింద ఉన్న భూముల రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు విధించడంతో అనేక సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేసింది.