'ఉపాధి'కి కేంద్రం వాటా నిధుల విడుదల

TG: కేంద్ర ప్రభుత్వం ‘వీబీజీ రామ్ జీ’ కింద రాష్ట్రానికి రూ.3,825.31 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ పథకం కింద కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40శాతం భరించాలి. కేంద్రం తన వాటా నిధులను ఉమ్మడి ఖాతాలో వేసింది. రాష్ట్రం తన వాటాగా రూ.2550.21 కోట్లు జమ చేయాల్సి ఉంది. అలా జరగకుంటే కూలీలకు చెల్లింపులు నిలిచిపోతాయి. కాగా ఈ స్కీమ్‌ను రేవంత్ సర్కార్ వ్యతిరేకిస్తోంది. రేపు(గురువారం) జరగబోయే కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్