పరువు నష్టం దావా కేసులో నిర్మలా సీతారామన్‌కు ఊరట

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఢిల్లీ న్యాయస్థానం బుధవారం ఊరట కల్పించింది. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి భార్య లిపికా మిత్ర దాఖలు చేసిన పరువు నష్టం ఫిర్యాదును రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై లిపికా మిత్ర ఈ దావా వేశారు. అయితే కేసు విచారణకు తగిన ఆధారాలు లేవని, రాజకీయ విమర్శలు పరువు నష్టం కిందకు రావని న్యాయస్థానం స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్