26 మంది మావోయిస్టులకు రిమాండ్ పొడిగింపు

AP: కృష్ణా జిల్లాలోని పెనమలూరులో అరెస్టు చేసిన 26 మంది మావోయిస్టులకు కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. వారిని పోలీసులు విజయవాడ కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు, వారికి రిమాండ్‌ను ఈ నెల 15 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్ అయిన ఈ మావోయిస్టులపై విచారణ కొనసాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా వారిని నేరుగా కోర్టులో హాజరుపరచకుండా వర్చువల్ విధానాన్ని అనుసరించారు.

సంబంధిత పోస్ట్