వ్యక్తులు సొంతంగా ఛానళ్లు ప్రారంభించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వింతగా ఉందని, ఆన్‌లైన్ కంటెంట్‌పై ఎవరో ఒకరు బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆన్‌లైన్ వేదికలపై వచ్చే కంటెంట్‌పై నియంత్రణ ఉండాలని కోర్టు అభిప్రాయపడింది.