TG: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుల విషయంలో రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. HYD, RR, MDCL జిల్లాల్లో కలిపి సుమారు 15 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఖాళీగా లేదా నిర్మాణం పూర్తికానివి ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే వీటిని 5km పరిధిలో నివసిస్తున్న పేద కుటుంబాలకు ప్రాధాన్యం ఇచ్చి ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హుల ఎంపికలో సొంత ఇల్లు లేనివారు, గతంలో ప్రభుత్వ గృహ పథకాల ద్వారా ఇల్లు పొందని వారిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.