ఏపీలో జాతీయ సగటు కంటే తగ్గిన వరి దిగుబడి

ఆర్థిక సర్వేలో ప్రకారం, ఏపీలో వరి దిగుబడి జాతీయ సగటు కంటే తగ్గిందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఖరీఫ్ సీజన్లో హెక్టార్ కు వరి దిగుబడి తగ్గిందని, దీనికి కారణం పంట కీలక సమయాల్లో అకాల వర్షాలు, వేడి, పొడి వాతావరణం అని సర్వే వెల్లడించింది. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ నివేదికను కూడా సర్వేలో ప్రస్తావించారు. వరి పండిస్తున్న పెద్ద రాష్ట్రాలలో ఏపీ, తెలంగాణ దిగుబడి తగ్గిందని ఆర్థిక సర్వే తెలిపింది.

సంబంధిత పోస్ట్