రిమ్స్ ప్రమాద ఘటన... పరిహారం ప్రకటించిన సర్కార్

TG: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంలో బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయం ప్రకటించింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. మంత్రి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులైన పిల్లల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వెంటనే హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕