దళితుడైన స్పీకర్‌పై ఇలా చేయడం సమంజసమేనా? అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. 'ఒక ఎమ్మెల్యే కేసు గురించి ఇలా చేయడం సరికాదు. సభలో BRS ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు బాధాకరం. భూ భారతి చట్టంపై చర్చ జరుగకుండా బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది. భ్య సమాజం సిగ్గుపడేలా భారాస సభ్యుల తీరు ఉంది. రౌడీయిజం చేయడం సరికాదు.. దీన్ని కట్టడి చేయండి' అని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.