TG: 'స్వచ్ఛ భారత్ మిషన్-2'లో భాగంగా టాయిలెట్స్ లేని 2.19 లక్షల ఇళ్లకు వాటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.12వేల చొప్పున అందించనుంది. ఇందిరమ్మ ఇళ్లతో పాటే మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం స్వచ్ఛ భారత్ నిధులను ఈ స్కీమ్‌కు లింక్ చేసింది. అర్హులు స్వచ్ఛ్ భారత్ వెబ్‌సైట్‌లో htps://swachhbharatmission.ddws.gov.in/ దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు పంచాయతీ కార్యదర్శిని సంప్రదించవచ్చు.