ఆత్మనిర్భర్ భారత్ పథకానికి రూ.2వేల కోట్లు

కేంద్ర బడ్జెట్‌ 2026లో ఆత్మనిర్భర్ భారత్ పథకానికి రూ.2,000 కోట్లు కేటాయించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణీకరణకు అధిక ప్రాధాన్యం ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2020లో ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ పథకం ద్వారా ‘లోకల్ టు గ్లోబల్’, ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాలను బలోపేతం చేయనున్నారు. స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహం, దిగుమతుల తగ్గింపు, ఆవిష్కరణల పెంపుతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక మద్దతు, మౌలిక వసతులు కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.

సంబంధిత పోస్ట్