ఏటా రైతు భరోసాకు రూ.20 వేల కోట్లు: CM రేవంత్

తెలంగాణలో ఏటా రూ.20 వేల కోట్లతో రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. భూమి లేని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీనవర్గాలను ఆదుకోవడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం కింద ఏటా రూ .12 వేలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టమన్నారు. ఈ పథకం కింద దాదాపు 10 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని తెలిపారు. గత పదేండ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్