రూ.258 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల

2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం రూ.258 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని కళాశాలల ఖాతాల్లో జమ చేశారు. గతంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తున్న ఈ మొత్తాన్ని, ఈ విద్యా సంవత్సరం నుంచి నేరుగా కళాశాలల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.4వేల కోట్లకు పైగా బకాయిలను విడతల వారీగా చెల్లిస్తోంది. ఫిబ్రవరిలోనూ దాదాపు రూ.1,200 కోట్లను విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్