బల్క్ డ్రగ్స్ కోసం రూ.5,210 కోట్ల పెట్టుబడులు: కేంద్రం

బల్క్‌ డ్రగ్స్‌ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద ఈ ఏడాది జూన్‌ నాటికి రూ.5,210.74 కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేంద్ర రసాయన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏపీఐలు, కీ స్టార్టింగ్‌ మెటీరియల్స్‌ తయారీకి 39 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఏపీలోని కాకినాడ సెజ్‌లో లిఫియస్‌ ఫార్మా పెన్సిలిన్‌ జీ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హిమాచల్‌, గుజరాత్‌, పంజాబ్‌లలోనూ పలు ఔషధ తయారీ యూనిట్లు ఏర్పాటయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕