TG: కేసీఆర్ హయాంలో 88 కోట్ల రూపాయల విలువైన మందులు వృథా అయ్యాయని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 9 లక్షల రూపాయల విలువైన మందులు మాత్రమే వృథా అయినట్లు కాగ్ లెక్కలతో సహా వెల్లడించింది. ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వచ్చే పేషెంట్స్ కోసం చేసిన మందుల కొనుగోలు వివరాలతో తెలంగాణ మెడికల్ కార్పొరేషన్ అధికారులు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు బుధవారం నివేదిక ఇచ్చారు. ఈ రిపోర్ట్ ప్రకారం 2017 నుంచి 2023 వరకూ సుమారు 2700 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేయగా, అందులో 88 కోట్ల విలువైన మందులు వృథాగా పోయాయని వివరించారు.