తెలంగాణలో పలురకాల రవాణా సర్వీసు ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైపొథెకేషన్ ఫీజును రూ.2,135-రూ.3,135కు పెంచేశారు. లెర్నింగ్ లైసెన్సు, డ్రైవింగ్ టెస్ట్ ఫీజుల ఛార్జీలు రూ.335 నుంచి రూ.440కి పెంచారు. టూవీలర్, కారు లెర్నింగ్ లైసెన్స్ ఫీజు రూ.450 నుంచి రూ.585కు పెంచారు. గతంలో డ్రైవింగ్ టెస్ట్‌కు రూ.1035 వసూలు చేస్తే ఇప్పుడు రూ.1135కు పెంచారు. వెహికల్ యాజమాన్య బదిలీ ఫీజు రూ.935- రూ.1805కు పెంచేశారు.