మేడారం భక్తుల తరలింపులో ఆర్టీసీ విఫలం!

TG: మేడారంలో భక్తుల తరలింపులో టీజీఎస్ఆర్టీసీ విఫలమైంది. గంటల తరబడి ఎదురుచూసినా బస్సులు లేకపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీగా ట్రాఫిక్ జామైంది. హనుమకొండ, హైదరాబాద్‌ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. వేలాదిమంది భక్తులతో ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. దీంతో చంటి బిడ్డ తల్లులు, వృద్ధులు, మహిళలు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్